27-07-2025 11:11:48 PM
ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చాటింపు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కాసిపేట మండలం అటవీ ప్రాంతంలో మరోసారి పెద్దపులి పంజా విప్పింది. ధర్మరావుపేట సెక్షన్ పరిధిలోని వెంకటాపూర్ రోట్టేపల్లి అటవీ శివారులో పెద్దపులి దాడిలో లేక దూడ మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. ఫారెస్ట్ అధికారులు ఈ ఘటనను ధ్రువీకరించారు. కాసిపేట మండలంలో ఇటీవలనే పులి దాడిలో లేక దూడ మృతి చెందిన సంఘటన మరొక ముందే మరో లేగ దూడను పెద్దపులి బలి తీసుకుంది. మేత కోసం వెళ్ళిన పశువులపై పెద్దపల్లి దాడి దాడి చేసింది. ఈ సంఘటనలో లేక దూడ మృతి చెందింది. లేగదూడ మృతి చెందడంతో మరోసారి ఈ ప్రాంతంలో పులి సంచారం వెలుగు చూసింది.
పులి దాడిలో మృతి చెందిన లేక దూడ గోల్డ్ గూడెంకు చెందిన కురిసెంగ అచ్యుతరావుకి చెందిందని గుర్తించారు. పెద్దపులి దాడి ఘటనను బెల్లంపల్లి అటవీ క్షేత్ర అధికారి పూర్ణచందర్ ధ్రువీకరించారు. లేగ దూడ యజమానికి నష్టపరిహార చెల్లిస్తామని తెలిపారు. అటవీ ప్రాంతంలోకి పశువుల కాపరులు సమీప పంట చేనులో పనికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పెద్దపులికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తే అటవీ శాఖ వారికి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరారు. పెద్దపులి సంచరిస్తున్న సమీప గ్రామాలలో డప్పు చాటింపును చేయించడం జరిగిందని తెలిపారు. అటవీ శివారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. లేగ దూడ చనిపోయిన ఘటన ను ఫారెస్ట్ అధికారులు సందర్శించారు.