calender_icon.png 28 July, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు నిరాధారమైన వార్తల జోలికి వెళ్ళకండి

27-07-2025 11:28:57 PM

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్..

ఖమ్మం (విజయక్రాంతి): జర్నలిస్టులు నిరాదారమైన వార్తల జోలికి వెళ్ళోద్దని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా(Khammam District) కేంద్రంలోని టీటీడిసీ కాన్ఫరెన్సర్ హాల్ లో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఏ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల మాట్లాడుతూ, వార్త సేకరణలో ఎవరి ప్రైవసీకి విఘాతం కలిగించరాదన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై ప్రభుత్వనికి విజ్ఞపణలు ఇచ్చామన్నారు. చిన్న పత్రికల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అన్నారు. అర్హతగల జర్నలిస్టులకు యాక్రిడిటేషన్ లు అందేలా చూడాలని టీ జే ఏ రాష్ట్ర అధ్యక్షులు కదిరి వెంకట రమణ రావు ప్రభుతాన్ని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై టీ జే ఏ ఎప్పటికప్పుడు స్పందిస్తుందన్నారు.

జర్నలిస్ట్ల రాయితీ జర్నలిస్టు రైల్వే పాస్ ల పునరుద్దరణకోసం కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నాం అని, ఇప్పటికే అనేక సార్లు కేంద్ర మంత్రులు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లినట్లు జాతీయ జర్నలిస్ట్ సంఘం(ఎన్ యూ జే(ఐ). ఉపాధ్యక్షులు ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ అన్నారు. రాజకీయ వార్తలు రాసేటప్పుడు అలోచించి రాయాలని, అలాగే పని చేసే పత్రికలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి(ఆర్ ఎన్ ఐ )పీ ఆర్  ఐ లాంటి అనుమతులు ఉన్నాయా లేదా చూసుకోవాలన్నారు. అక్రిడిటేషన్ వున్నవారే జర్నలిస్టులు అనుకోవద్దు, కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న అన్ని పత్రికల యాజమాన్యాలు, ఎడిటర్ లు ఇచ్చిన గుర్తింపు కార్డు వున్నవారు కూడా జర్నలిస్టులే అని అన్నారు. సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పోరు చేసే ప్రతీ జర్నలిస్ట్ కు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై 9 తీర్మాణాలు చేసి ఆమోదించారు. సమావేశంలో టీ జే ఏ రాష్ట్ర కార్యదర్శి ఎం ఆర్. గౌరీ,ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు  గంగారపు నాగస్వామి, మత్తి రామకృష్ణ, జిల్లా నాయకులు, కిరణ్, సురేందర్,రమేష్, వెంకన్న, శ్రీను, లెనిన్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన టి జె ఏ నాయకులు పాల్గొన్నారు.