12-01-2026 04:45:06 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులుగా నామని రాజిరెడ్డి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, వైస్ ప్రెసిడెంట్ గా ఏరుకొండ స్రవంతి రమేష్, అబ్బోజు కవిత బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శిగా కోదాటి సాయికిరణ్, సహాయ కార్యదర్శిగా ఉప్పు లక్ష్మి, క్యాషియర్ గా జూపల్లి తిరుమలరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వీరిని జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సుల్తానాబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనునాయక్ దామోదర్ రావు లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు.