calender_icon.png 12 January, 2026 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సన్యాన్ జయప్రదం చేయండి

12-01-2026 07:32:02 PM

మునుగోడు,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా  తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయాలని ఫిబ్రవరి 12న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు కోరారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక రైతు , వ్యవసాయ కూలీలకు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనవరి 18 వరకు లేబర్ కోడ్స్ విబి రామ్ జీ  చట్టం జాతీయ విత్తన బిల్లు , విద్యుత్ సవరణ బిల్లు రద్దు కోరుతూ చేపట్టిన పోరాటాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు . ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పగిళ్ల మధు , కట్ట లింగస్వామి , సింగపంగ నరేష్  ఉన్నారు.