calender_icon.png 12 January, 2026 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి ప్రేమ్ చందర్ రావు రాజీనామా

12-01-2026 07:33:59 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పురం ప్రేమ్ చందర్ రావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో దాదాపు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశానని తన రాజకీయ గురువు మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో  కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఎంపీటీసీగా, స్కూల్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో డైరెక్టర్ తదితర పదవులు అనుభవించానని అన్నారు. గతంలో కొన్ని సంవత్సరాలు విలేఖరిగా పని చేశానని అన్నారు. పది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరానని తన వ్యక్తిగత కారణాల వల్ల  పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రేమ్ చందర్ రావు స్పష్టం చేశారు.