calender_icon.png 12 January, 2026 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్దే ధ్యేయంగా పని చేయాలి: ఏపీఎం మంగమ్మ

12-01-2026 05:13:46 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచి తండా సర్పంచిగా ఎన్నికైన బానోతు బద్రు నాయక్ ను శ్రీ దుర్గా సమైక్యమండలి భవనం నందు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏపీఎం మంగమ్మ మాట్లాడుతూ... గ్రామాభివృద్దే ధ్యేయంగా పని చేయాలి గత 15 సంవత్సరాల నుంచి డ్వాక్రా మహిళా సంఘంలో (సిఏ)గా సేవలందించి ఎంతో మంచి పేరు సంపాదించుకుని ఇవాళ సర్పంచ్ గా ఎన్నికైనందుకు మా అందరికీ చాలా సంతోషకరమైన విషమని అన్నారు. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటు గ్రామ ప్రజల సహకారంతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివోల మండల యూనియన్ ప్రెసిడెంట్ రాంపేల్లి వెంకన్న, ఉపాధ్యక్షులు కొండూరు వెంకన్న, మరిపెడ మండల సీసీలు, సీఏ లు తదితరులు పాల్గొన్నారు.