calender_icon.png 12 January, 2026 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లి కోర్టులో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

12-01-2026 07:16:21 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ పరిధి బోడుప్పల్ సర్కిల్  మేడిపల్లి కోర్టు ప్రాంగణంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నరేష్ కుమార్ నర్సింగోజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ...  స్వామి వివేకానంద భారతదేశపు గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మహనీయుడు అని కొనియాడారు. యువతకు స్వాభిమానాన్ని, జాతీయతను నూరిపోసిన మహోన్నత నాయకుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.