12-01-2026 07:36:04 PM
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
కామారెడ్డి,(విజయక్రాంతి): రైతు భరోసాని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ కి మెమోరాండం ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మోతీ రామ్ నాయక్ జిల్లా అధ్యక్షులు దొడ్లేమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి దశరథ్ , వారు మాట్లాడుతూ రైతు భరోసా డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సింది ఉండే కానీ జనవరి పూర్తి వరకు కాలయాపన చేస్తా ఉన్నారు.
రైతులు అధిక వడ్డీతో అప్పులు తెచ్చుకొని అనేక అవస్తాలు పడతా ఉన్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతి రెండు రోజులు ముందే రైతుబరసన విడుదల చేయాలని మనస్ఫూర్తిగా రైతులు కోరుతున్నారు లేనిచో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని దిగుతామని రైతు సంఘం కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో మధుసూదన్ గణేష్, నన్యా నాయక్, దేవి సింగ్ నరాన్ నాయక్, బాల వీరయ్య, పోశయ్య, రైతులు పాల్గొన్నారు.