7 May, 2026 | 1:30 AM

బాధ్యతలు స్వీకరించిన నంగునూరు, పాలమాకుల పీఏసీఎస్ చైర్మన్లు

07-05-2026 12:00 AM

నంగునూరు, మే 6: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పాత పాలకవర్గాలే కొనసాగాలని రాష్ట్ర హైకోర్టు వెలువరించిన తీర్పు అమలులోకి వచ్చింది.ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీస్ స్పెషల్ కమిషనర్ రిజిస్ట్రార్ ప్రసన్న జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి,నంగునూరు మండలంలోని పీఏసీఎస్ అధ్యక్షులు బుధవారం తిరిగి తమ బాధ్యతలను చేపట్టారు. నంగునూరు పీఏసీఎస్ అధ్యక్షులుగా కోల రమేష్ గౌడ్, పాలమాకుల పీఏసీఎస్ అధ్యక్షులుగా ఎల్లంకి మహిపాల్ రెడ్డి తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు.

వీరితో పాటు ఆయా పాలకవర్గ సభ్యులు కూడా విధుల్లో చేరారు.అనంతరం వారు మాట్లాడుతూ.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బోర్డులను రద్దు చేసి, వాటిని నామినేటెడ్ పదవులుగా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రయత్నించిందని వారు ఆరోపించారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక బలమైన గుణపాఠమని వారు వ్యాఖ్యానించారు.రాజకీయాలకు అతీతంగా రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తామని వారు స్పష్టం చేశారు.