వనదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర బాలల హక్కుల
07-05-2026 12:00 AM
పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి
పాపన్నపేట, మే 6: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాతను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది వారిని సత్కరించారు. వీరి వెంట బోర్డు సభ్యులు వందన గౌడ్, చందన, వచన్ కుమార్, బండి అపర్ణ, ప్రేమ్ లత అగర్వాల్, ఆలయ సిబ్బంది ఉన్నారు.






