06-08-2025 11:33:30 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పోలీస్ స్టేషన్(Sirgapur Police Station) ఎస్సై-2గా నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్సై-2 నారాయణ మాట్లాడుతూ... మండలంలో శాంతి భద్రతలకు కృషి చేస్తానని నారాయణ అన్నారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలం వరకు ఇక్కడ ఏఎస్సైగా పనిచేసిన ఈయన ఎస్సైగా పదోన్నతి పొందారు. ఆయన్ను ఇదే స్టేషన్కు ఎస్సై-2 అటాచ్ చేస్తూ ఎస్పీ పంకజ్ పారితోష్ ఉత్తర్వులు జారీ చేయడంతో విధుల్లో చేరారు.