calender_icon.png 7 August, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: ఎస్ఐ నాగరాజు

06-08-2025 11:30:54 PM

నూతనకల్ (విజయక్రాంతి): మండల పరిధిలోని మాచనపల్లి గ్రామంలో ఎస్ఐ నాగరాజు(SI Nagaraju) ఆధ్వర్యంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక అంశాలు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలంతా చట్టాన్ని గౌరవిస్తూ అన్యాయాన్ని సహించకుండా ముందుకు వస్తే పోలీస్ శాఖ మేమున్నామంటూ భరోసా ఇస్తుందన్నారు. ప్రజల సహకారం లేకుండా పోలీస్ న్యాయ వ్యవస్థ పటిష్టంగా పనిచేయడం సాధ్యపడదన్నారు. గ్రామంలో యువత ఆన్లైన్ బెట్టింగ్లకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా చదువుపై దృష్టి సారించి వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.