06-08-2025 11:36:49 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల ఎంపీడీవోగా శారదా దేవి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించారు. నాగలిగిద్ద ఎంపీడీవో మహేశ్ గత కొద్దిరోజుల నుంచి ఇంచార్జ్ ఎంపీడీవోగా వ్యవహరిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా నుంచి బదిలీపై సిర్గాపూర్ ఎంపీడీవోగా శారదా దేవి వచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.