13 May, 2026 | 11:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

నాయకుడిగా కాదు.. సేవకుడిగా ఉంటా..

09-05-2026 06:54 PM

* కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నరేందర్ గౌడ్

పాపన్నపేట: అందరి సహాయ సహకారాలతో పార్టీ అభివృద్ధికి నాయకుడిగా కాదు.. సేవకుడిలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులు లింగంపేట నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల బాధ్యతలను అప్పగించిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కలసి కట్టుగా కృషి చేసేందుకు ప్రతి గ్రామ కార్యకర్తలను కలిసి గ్రామ సమస్యలను ఎమ్మెల్యే రోహిత్ రావు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తానన్నారు. కార్యకర్తలఅందరి సహాయ సహకారాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తానన్నారు.