9 May, 2026 | 8:07 PM

దళిత మహిళను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

09-05-2026 06:57 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): దళిత మహిళపై అసభ్యంగా పాట రాసి పాడిన వారి పైన  SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ దళిత సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. బెల్లంపల్లి పట్టణం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ వద్ధ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు జిల్లా SC ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిలుక రాజనర్సు  హాజరై మాట్లాడారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం (RG) గోదావరిఖనిలో  ఒక దళిత మహిళపై అసభ్యంగా పాట రాసి పాడి దళిత మహిళ వ్యక్తిత్వాన్ని హననం చేయడాన్ని తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి యావత్ మహిళ సోదరీమణులందరని అవమాన పెంచారని మండిపడ్డారు. పాట రాసి పాడిన వారిని వారి వెనకాల ఉండి పాట రాయమని, పాడమని ప్రేరేపించిన వారి మీద SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక స్త్రీ అందులో దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక స్త్రీ నీ ఇంతలా అవమాన పరిచే విధంగా పాటలు పాడుతూ సభ్య సమాజం తలదించుకునేల చేయడమే నన్నారు.

ముఖ్యంగా సింగరేణిలో AITUC యూనియన్ అంటే కార్మిక వర్గానికి ఎర్ర జెండా పార్టీగా కార్మిక వర్గానికి పురుష, మహిళ కార్మికులకు  అండగా నిలిచి వారి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం పని చేస్తుందని నమ్మే వారనీ తెలిపారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లలో మహిళ కార్మిక కంఠకులుగా మారి మహిళ కార్మికులను ఇలా వేధించాడని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. AITUC యూనియన్ లో, స్త్రీ లపై పురుషాధిక్యతకు ఈ సంఘటన నిదర్శనం అని పేర్కొన్నారు.

ఈ సంఘటనకు బాధ్యులు ఆయన వారిని, వారికి సహకరించిన వారిని AITUC అగ్ర నాయకత్వం వెంటనే యూనియన్ నుండి బహిష్కరించాలన్నారు. లేకుంటే ఈ సంఘటనకు బాధ్యులను AITUC యూనియన్ కొమ్ము కాస్తుందని భావించవలసి వస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం కూడా  ఈ సంఘటనను  తీవ్ర చర్యగా భావించి తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ అధికారులు కూడా  సోషియల్ మీడియాలో ఈ పాట వైరల్ కావడాన్ని పరిగణలోకి తీసుకొనీ  బాధ్యుల పై SC ST అట్రాసిటీ కేసుతో పాటు సంబంధిత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.