calender_icon.png 18 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మేలైన ప్రజాపాలన అందిస్తున్నాం!

18-09-2025 01:19:35 AM

మెదక్‌లో జెండావిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) :తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సంద ర్బంగా బుధవారం మెదక్ కలెక్టరెట్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు  జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి ముఖ్య అతిధిగా విచ్చేయగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ ఎమ్మెల్యే మై నంపల్లి రోహిత్రావు, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు, గ్రంథాల య చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, ఆర్డి వో రమాదేవి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఇతర జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి అమర వీరుల స్తూపనికి నివాళులు అర్పించారు.

అనంతరం మంత్రి జిల్లా లోని వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి గురించి సందేశం ద్వారా వివరించారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరి గిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైందన్నారు. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలైనచాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలా దేవి కీలక పాత్ర పోషించారన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం మెదక్ జిల్లా సమగ్రాభివృద్ధికి అమలు చే స్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మహిళా, శిశు సంక్షేమం, రో డ్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీలు, ము నిసిపాలిటులు, వాటర్ సప్లై, వెటర్నరీ మరి యు ఇతర అన్ని శాఖలలో విప్లవాత్మకమైన అభివృద్ధి సాదించడం గర్వకారణమన్నారు. మెదక్ జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కళ ప్రదర్శన నిర్వహించారు. 

ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ 

సంగారెడ్డి, సెప్టెంబర్ 17 :సంగారెడ్డి జి ల్లా ను అన్ని రంగాలలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిల్పడానికి ప్రజా ప్రభుత్వం పనిచే స్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దా మోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవా రం సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన ప్రజా పా లన దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ముందు గా కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలంగాణ అ మరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి ,పోలీసు గౌరవ వం దనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమా వేశంలో మంత్రి జిల్లా ప్రగతి నివేదికను చది వి వినిపించారు. ముందుగా జిల్లా ప్రజలకు మంత్రి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎంతోమంది త్యాగధనుల ఫ లితంగా 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం (హైదరాబాద్ స్టేట్) విలీనమైనదని తెలిపారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభు త్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపడానికి కృ షి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధానికి చేరువగా ఉన్న సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోని అగ్రగామిగా అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఇందిరమ్మ ఇండ్లు, రుణమా ఫీ, ఉచిత గృహ విద్యుత్తు, ఉచిత బస్సు ప్ర యాణం, లాంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార ధ్యంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టి సంక్షేమ పథకాలు ప్రతి ఒ క్కరికి అందేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య, ఎస్పి పరితోష్ పంకజ్ ,టి జి ఐ ఐ సీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్ట ర్లు చంద్రశేఖర్, మాధురి డిఆర్‌ఓ పద్మజ రా ణి, సంగారెడ్డి జిల్లా గ్రంథాల సం స్థ చైర్మన్ అంజయ్య ,వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.