15-10-2025 01:24:24 AM
మేడ్చల్, అక్టోబర్ 14(విజయ క్రాంతి): హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను స్థానిక కాలనీవాసులు దేవరపల్లి సురేందర్ రెడ్డి,దేవరపల్లితరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ డివిజన్ లోని సమస్యలపై సత్వరమే పరిష్కార మార్గం చూపేందుకు కార్పొరేటర్ చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు. వీరితోపాటు స్థానిక కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.