calender_icon.png 15 October, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలిగొండను కప్పేసిన మంచు దుప్పటి

15-10-2025 10:10:22 AM

సాలెగూళ్లపై "మంచు ముత్యాలు"

వలిగొండ,(విజయక్రాంతి): బుధవారం ఉదయం వలిగొండ పట్టణ కేంద్రాన్ని మంచు దుప్పటి కప్పేసింది. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలను కూడా దట్టమైన మంచు అలముకుంది. వలిగొండ మండల కేంద్రంలో దట్టమైన పొగ మంచు కురియంతో వాహనదారులు ఉదయం 7 గంటల వరకు కూడా వాహనాలకు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణాలు సాగించారు. పొగ మంచు కారణంగా గ్రామాల నుండి పాలను, కూరగాయలను, ఆకుకూరలను తీసుకువచ్చేవారు కొంత ఇబ్బంది పడ్డారు. సాలెగూళ్లపై పొగ మంచు బిందువులు కురియగా అవి మంచు ముత్యాల దండల వలె మెరుస్తూ కనిపించాయి.