15-10-2025 11:57:09 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి(Lankala Deepak Reddy) పేరను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. 2023లోనూ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. దీపక్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో(Jubilee Hills by-election) బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలిచి ఆ విజయాన్ని ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అయింది.
అయితే జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నియోజకవర్గ ప్రజలతో వరస సమావేశాలు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ ఎలాగైన గెలావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులను బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్(Naveen Yadav)ను నిలబెట్టారు. నవీన్ యాదవ్ కు టికెట్ దక్కడంతో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అలిగారు. ఆయన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేకే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇంటికి వెళ్లి బుజ్జగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం నాడు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త్రిముఖ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచన వేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతుంది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని ప్రారంభించాయి.