calender_icon.png 15 October, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనజీవనంలోకి మల్లోజుల వేణుగోపాల్

15-10-2025 11:33:35 AM

మహారాష్ట్ర: గడ్చిరోలిలో మావోయిస్టు(Maoist) అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు(Mallojula Venugopal Rao) లొంగిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) కు ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ రావుతో పాటు 60 మంది నక్సల్స్ ను గడ్చిరౌలి ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. మీడియా సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఎం సమక్షంలో మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన నక్సల్స్ ను ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. నక్సల్స్ ఫ్రీ భారత్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమమని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. మల్లోజుల నిర్ణయాన్ని సీఎం స్వాగతించారు. అమిత్ షా ఆదేశాలతో మహారాష్ట్రను నక్సల్ ఫ్రీగా మార్చేస్తామని స్పష్టం చేశారు.

మల్లోజుల వేణుగోపాల్ రావు ఉద్యమ ప్రస్థానం..

కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని నిరుపేద కుటుంబంలో వేణుగోపాల్ రావు జన్మించారు. దివంగత మావోయిస్టు నేత కిషన్ జీకి(Maoist leader Kishan ji) తమ్ముడు. మల్లోజుల వెంకటయ్య, మధరమ్మ దంపతుల ముగ్గురు కొడుకుల్లో చిన్నవాడు. అగ్రకులానికి చెందిన వేణుగోపాల్ రావుది పోరాట కుటుంబం. తెలంగాణ సాయుధ పోరాటంలో వేణుగోపాల్ తండ్రి వెంకటయ్య పాల్గొన్నారు. 1970ల్లో అడవిబాట పట్టిన ఆయన అన్న కిషన్ జీ మావోయిస్టు అగ్రనేతగా ఎదిగారు. 2011 నవంబర్ 24 బెంగాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో కిషన్ జీ మృతి చెందాడు. ఈ ఏడాది జనవరిలో వేణగోపాల్ రావు భార్య తారక్క(Venugopal Rao's wife Tarakka) పోలీసులకు లొంగిపోయింది. 1970ల్లో మల్లోజుల వేణుగోపాల్ రావు మావోయిస్టు ఉద్యమంలో చేరారు.  పార్టీ విధివిధానాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. దండకారణ్య ప్రత్యేక జోనల్  కమిటీకి అధిపతిగా వేణుగోపాల్ రావు పనిచేశారు.

కొత్త గెరిల్లా జోన్ ఏర్పాటు(Guerrilla zone) బాధ్యతలను ఆయన స్వీకరించారు. 2010లో పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. 2010లో దంతెవాడలో సీఆర్పీఎఫ్ పై దాడి ఘటనలో మల్లోజుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పశ్చిమ బెంగాల్ లో జరిగిన లాల్ గర్ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. 1981 లో మల్లోజుల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఏటూరునాగారం దళంలో సభ్యుడిగా కొనసాగారు. 1982లో మహదేవపూర్ లో ఆయన పోలీసులకు చిక్కారు. ఏడాది పాటు జైలు జీవితం అనుభవించారు. జైలు నుంచి బయటకు వచ్చిన మల్లోజుల మళ్లీ అడవిబాట పట్టారు. 1993లో డీకేఎస్ జెడ్పీ కార్యదర్శిగా నియామకం అయ్యారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియామకం అయ్యారు. 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. మల్లోజులకు అభయ్, సోను, భూపతి, వికేక్ పేర్లున్నాయి. మల్లోజులపై రూ. 8 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.