01-08-2025 12:00:00 AM
దళిత సంఘాల డిమాండ్
బాన్సువాడ జూలై 31 (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ గ్రామానికి చెందిన నల్లజెరు జ్యోతికి నర్ర సాయిలు న్యాయం చేయాలని, జ్యోతి వారి కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా జ్యోతి పై దాడి చేసిన నర్ర సాయిలు మరియు వారి అనుచ రులను వెంటనే రిమాండ్ చేయాలని, అమ్మాయికి ఆమె కొడుకుకు తగిన న్యాయం జరిగేవిధంగా డి ఎస్ పి చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో మాల మహానాడు సంఘ సభ్యులు పాల్గొన్నారు.