calender_icon.png 13 May, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిజం వృత్తికే న్యాయం చేసిన నర్సింగ్ రావు

12-05-2025 01:35:02 AM

నిజామాబాదు ఎంపీ

నిజామాబాదు మే 11(విజయ క్రాంతి) : అన్ని వృతుల్లో కెల్లా జర్నలిజం వృత్తి ఉత్తమ మైనదని జర్నలిజం వృత్తికే న్యాయం చేసిన నర్సింగ్ రావు అనీ నిజామాబాదు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు.

అదివారం రోజు నిజామాబాదు లోని క్యాంపు కార్యలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల జర్నలిస్టల సంక్షేమ సంగం ఆధ్వర్యంలో విజయవాడ లోని తుమ్ముల పల్లి కలాక్షేత్రం లో  సీనియర్ జర్నలిస్ట్ అవార్డు పొందిన బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గంలో సీనియర్ జర్నలిస్ట్ బి. ఆర్. నర్దింగ్ రావు జర్నలిజo లో గొప్ప విలువలతో సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ, ప్రజల చేత ప్రశంసలు పొoదుతూ భూ కబ్జా దారుల్లో గుబులు పుట్టిస్తూ వెనక అడుగు వేయకుండా జర్నలిజమ్ లో ముందుకు వెళ్తున్న నర్సింగ్ రావు ఇంకా భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని అరవింద్ ధర్మపురి అన్నరు.

2024- 25  గాను రాష్ట్ర స్థాయి పౌర విభాగం (సీనియర్) ఉత్తమ జర్నలిస్టు అవార్డును ఏప్రిల్ 12 నా తెలుగు రాష్ట్రాల జర్నలిస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  సన్మానం జరగటం నిజామాబాదు జిల్లాకే ర్వకరణమని అన్నారు. ఇది ఇలా ఉండగా బాల్కొండ లో పుట్టిన ఊరిపై పురాతన ఖిల్లా చరిత్రను పుస్తక రూపంలో తేవడమే కాకుండా ఈ ప్రాంతంలో ఐదు ఆలయాల గురించి వివరించడం విశేషమని ఆయన అన్నారు.

అవార్డు రాజులకే అంకితం 

2024 - 25 సంవత్సరానికి గాను జర్నలిజంలో  నర్సింగ్ రావు సేవల్ని గుర్తించి పౌర విభాగంలో  తగిన గుర్తింపును ఇచ్చిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగ నాయకులు మరియు రాష్ట్ర అధ్యక్షులు జి. శ్రీనివాస్ లకు బ్రాహ్మ్మ రౌతు నర్సింగ్ రావు కృతజ్ఞత్సలు తెలియజేస్తూ నా అవార్డును పూర్వపు అల్లకొండ ఖిల్లా రాజులైన ‘అల్లయ్య,కొండయ్య‘ మరియు బాల్కొండ ప్రజానికానికి అంకిత మిస్తున్నాను అనీ నర్సింగ్ రావు వివరించారు.