6 August, 2026 | 2:31 AM

డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు

06-08-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

ముషీరాబాద్,ఆగస్టు 5 (విజయక్రాంతి): మద్యం డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండి, ఉత్తమ వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. చిక్కడపల్లి బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్  స్పందన్ పేరుతో వ్యసనముక్తి ప్రతిజ్ఞ  చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక న్యాయం సాధికారిక మంత్రిత్వ శాఖ, సహకారంతో ’సే నోట్ అడిక్షన్’ నినాదంతో మద్యం, డ్రగ్స్ వినియోగంపై అవగా హన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు.