calender_icon.png 18 August, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న లయన్స్ క్లబ్ మెగా కంటి వైద్య శిబిరం

18-08-2025 10:03:11 PM

40 మందికి పరీక్షలు, 6 మందికి ఆపరేషన్‌

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): మండలం చెక్కపల్లి గ్రామంలో వేములవాడ రాజన్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 30-40 మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా, 6 మందిని ఆపరేషన్ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేయించుకునే వారికి అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేయనున్నట్టు రాజన్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోలిపాక నరసయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీపీ, షుగర్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలపై ప్రత్యేక వైద్య శిబిరాలు, ముఖ్యంగా మహిళల ఆరోగ్య పరిస్థితులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్‌పై కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రజలకు జాగృతి కల్పించడానికి లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.

సేవాభావంతో గ్రామాల్లో పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి సహకరించే కార్యక్రమాల్లో యువత కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శిబిరానికి మంచి స్పందన లభించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రేకుర్తి కంటి దవాఖాన డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నరసయ్య హామీ ఇచ్చారు.