calender_icon.png 18 August, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుడు ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం పుష్పాలు

18-08-2025 10:06:13 PM

అరుదైన పుష్పాన్ని చూసేందుకు ఎగబడ్డ స్థానికులు

ఇచ్చోడ,(విజయక్రాంతి): అరుదుగా వికసించే బ్రహ్మ కమల పుష్పం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో వికసించింది. మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాంపల్లి కాంతయ్య గతంలో తన ఇంట్లో బ్రహ్మ కమలం మొక్కను నాటాడు. ఐతే ఆదివారం రాత్రి చెట్టుకు బ్రహ్మ కమలం పువ్వులు వికసించాయి. సోమవారం ఉదయం వికసించిన బ్రహ్మ కమలం పుష్పాలను చూసి ఉపాధ్యాయుడు కాంతయ్య దంపతులు పూజలు నిర్వహించారు.

ఈ బ్రహ్మ కమలం పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడి సతీమణి లక్ష్మీ మాట్లాడుతూ... తమ ఇంటిలో బ్రహ్మ కమలం పూయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సరిగ్గా మూడేళ్ల కిందట తమ ఇంటి పెరట్లో ఈ మొక్క నాటామన్నారు. తాజాగా బ్రహ్మకమలం విరబూసిందని ఆమె చెప్పారు. ఆ పుష్పాలను స్థానిక ఆలయానికి అందజేస్తామన్నారు. అరుదైన, ప్రత్యేకత కలిగిన పుష్పం తమ వీధిలో వికసించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.