23-12-2025 04:33:16 PM
విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్
మంథని,(విజయక్రాంతి): రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని మంథని విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంగళవారం మంథని పట్టణంలో విద్యార్థి నాయకుడు డిగంబర్ ఆధ్వర్యంలో మంథని పట్టణానికి చెందిన రైతు నాయకుడు ఉత్తమ రైతు మూల పురుషోత్తం రెడ్డి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిగంబర్ మాట్లాడుతూ రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరితో పాటు ప్రభుత్వాలపై కూడా ఉందని అన్నారు.
రైతులను గౌరవించడం మన అందరి బాధ్యత అని అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రైతులకు సెలవు అనేది ఉండదని, ఒకవేళ రైతులు సెలవు పెట్టినట్లయితే మనందరం ఏమి తిని బతుకుతామని అన్నారు .అన్నదాతలకు అందరం అండగా ఉండాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిన్న ఓదాల సర్పంచ్ నాగుల శారదరాజయ్య, ముత్యాల స్వరూప, రాజేష్, మోత్కు అశోక్, మిట్ట రాజు, ముత్యాల లక్ష్మయ్య, లింగాల మల్లేష్, విజయ్ కుమార్, సిద్ధి శ్రీనివాస్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.