23-12-2025 04:30:45 PM
* అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు గుప్త
చేర్యాల: చేర్యాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో డిసెంబర్ 25న మహా మండల పడిపూజ శాంతి స్వరూపులు రాజు గురుస్వామి ముస్తాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త మంగళవారం తెలిపారు. 25న గురువారం ఉదయం 6:30 గంటలకు గణపతి హోమం, 10 గంటలకు మూలవిరాట్ కు పంచామృత అభిషేకం, తదనంతరం లక్ష పుష్పర్చిన, సాయంత్రం 6:30గంటలకు తిరు దీపారాధన హరిద్రా గణపతి పూజ, రాత్రి 8 గంటలకు వివిధ రకాల సుగంధ ద్రవ్య షతౌషదీ సహిత మహా బలాభిషేకం, రాత్రి 10 గంటలకు మహా నివేదన, పడి హారతి పూజా కార్యక్రమలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దివ్య అనుభూతిని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని కోరారు.