26-01-2026 05:04:23 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పారిశుధ్య కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన నలుగురు పారిశుధ్య కార్మికులకు డిప్యూటీ కమిషనర్ శాలువాలతో సత్కరించి, వారి సేవలను కొనియాడుతూ, పట్టణ పరిశుభ్రత, ప్రజాఆరోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ సర్కిల్ అధికారులు, సిబ్బంది, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.