త్వరలో జాతీయ రహదారి పనులు
వికారాబాద్,జులై 22( విజయక్రాంతి) పోలీస్ అకాడమీ మన్నెగూడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 163 విస్తరణతో జిల్లా ప్రజ ల అభివృద్ధి సాధ్యపడుతుందని, రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేసేలా తన వంతు సహకారం అందిస్తానని తాండూర్ కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత 15 రోజులుగా జాతీయ రోడ్డు విస్తరణ సాధన సమితి స భ్యులు హైదర్షా కోట్ లో విస్తృత సాయి స మావేశాలు నిర్వహిస్తున్నారు.
చేవెళ్ల వికారాబాద్, తాండూర్, కొడంగల్ నియోజకవర్గా లకు చెందిన సభ్యులు రోడ్డు విస్తరణ జరిగితే కలిసి వచ్చే అభివృద్ధి గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో తాండూర్ కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈవో బు య్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ రోడ్డు విస్తరణ జరిగితే చేవెళ్ల, తాండూర్, కొడంగల్ ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.






