23-07-2025 12:46:16 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్
నిర్మల్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విషయంలో మోసం చేసిందని బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. మంగళవారం రుణమాఫీ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కోరుతూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు జిల్లాలో 2 లక్షల పైగా బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు సంపూర్ణ రుణమాఫీ కాలేదని కేవలం 50 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకు షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.