calender_icon.png 28 July, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న ఉత్పత్తుల మేళా...

23-07-2025 12:47:41 AM

బెల్లంపల్లి అర్బన్, జూలై 22 : బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళ వారం స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు తయారు చేసి ప్రదర్శించిన ఉత్పత్తుల మేళా అందరిని ఆకట్టుకుంది. ఈ ఉత్పత్తుల మేళాను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక మహిళా గ్రూపులు 50వ రోజును విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఈ 50 రోజుల్లో తయారుచేసిన రకరకాల ఉత్పత్తులను మేళా ద్వారా తమ ప్రతిభ పాట వాలను చాటుకున్నారు.

స్వయం సమృద్ధి కోసం మహిళల అభివృద్ధి కోసం తలపెట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం మహిళల్లో ఉత్పత్తుల తయారు నైపుణ్యతను అభివృద్ధి చేసిందని చెప్పవచ్చు. ఉత్పత్తుల మేళాకు విశేషమైన స్పందన కనిపించింది. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను సరసమైన ధరలకు విక్రయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ దుర్గయ్య, స్వయం సహాయక మహిళా సంఘాల ఆర్పీలు, సభ్యు లు, అధికారులు పాల్గొన్నారు.