5 March, 2026 | 4:53 AM

మై హోమ్‌లో జాతీయ భద్రత వారోత్సవాలు

05-03-2026 12:00 AM

మేళ్లచెరువు, మార్చి 4: జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక మై హోమ్ సిమెంట్  పరిశ్రమలో బుధవారం సిబ్బంది, కార్మికులు భద్రత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు భద్రత జండాను ఎగరవేశారు. 55 వ జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో నిర్వహించిన భద్రత పద్యాల పోటీల్లో ఆంగ్లంలో మొదటి బహుమతి, హిందీలో మూడో బహుమతి పరిశ్రమ సిబ్బందికి వచ్చాయని తెలిపారు.

ఈ బహుమతులను రవీంద్ర భారతి, హైదరాబాదులో జరిగిన జాతీయ భద్రతా ప్రారంభోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎం. దానం కిషోర్ (చీఫ్ సెక్రటరీ), వై. మోహన్ బాబు (డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్) చేతుల మీదుగా అందుకున్నారు. ఈ బహుమతులు వచ్చిన వారికి మై హోమ్ ఇండస్ట్రీస్ తరపున ఎన్. శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటిస్తూ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని మరియు ఈ సంవత్సరం సేఫ్టీ థీమ్ ‘భద్రతను మెరుగుపరచడానికి, అందరినీ భాగస్వామ్యం చేయండి, అవగాహన కల్పించండి, సాధికారత చేయండి. ఈ మూడు ప్రధాన అంశాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భద్రతాధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.