15-10-2025 12:00:00 AM
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్
ఆదిలాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల్లో ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో చేపట్టిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ పాలిత ప్రాంతాల్లో వర్గీకరణ అమలు చేయకుండా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అమలు చేయడం సరికాదని, 59 కులాలున్న ఎస్సీలకు నాలుగు శాతం రిజర్వేష న్ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జాతీయస్థాయిలో చేపట్టే వర్గీకరణ వ్యతిరేక ఉద్య మానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు బల్లెం లక్ష్మణ్, ప్రభాకర్ రావు, బాలశౌరి,శరత్,ప్రేమ్ బాబు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.