15-10-2025 09:39:50 AM
తుంగతుర్తి మండల క్రీడాకారులు బంధువులు మేధావులు హర్షం.
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జక్కి శ్రీకర్ అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపికయ్యారు. మండల, జిల్లా స్థాయిలో రాణించి ఈనెల 16 నుంచి 19 వరకు రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనాడు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు శ్రీకర్ ను అభినందించారు. పేద కుటుంబంలో పుట్టి, ఒక ప్రక్క చదువుతోపాటు, మరొక ప్రక్క క్రీడలో రాణించడం హర్షించదగ్గ విషయమని, క్రీడాకారులు అభిమానులు, కుటుంబ సభ్యులు, మేధావులు, పేర్కొన్నారు.