15-10-2025 09:18:07 AM
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలులో జరిగే "సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్" కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ ప్రాజెక్టులు పరిశ్రమ, విద్యుత్ ప్రసారం, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలలో విస్తరించి ఉన్నాయి. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రహదారిపై రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. హైదరాబాద్- శ్రీశైలం, దోర్నాల- శ్రీశైలం రహదారి మార్గాల్లో వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ పర్యటన అనంతరం వాహన రాకపోకలు పునరుద్ధరించనున్నారు.