calender_icon.png 15 October, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

15-10-2025 09:38:26 AM

జిల్లా కో ఆర్డినేటర్ నర్సింహ చారి

సిద్దిపేట (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల యందు 2025 -26 విద్యా సంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి(Siddipet District Collector Haimavati) ఆదేశానుసారం  జిల్లాలోని బాలుర, బాలికల పాఠశాల, కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ చేర్యాల ప్రిన్సిపల్ నరసింహ చారి తెలిపారు. చేర్యాల, వర్గల్, కోహెడ, చిన్నకోడూరు, అల్వాల్ ,దుబ్బాక ,హుస్నాబాద్, బాలికల పాఠశాలలు, కళాశాలలు ములుగు ,జగదేవ్పూర్, గజ్వేల్, సిద్దిపేట రూరల్, రామక్కపేట, మిట్టపల్లి, తొగుట, బెజ్జంకిలలో 5వ తరగతి నుండి 9 వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్లకు  అర్హత గల విద్యార్థులు దరఖాస్తులు (Applications) చేసుకోవాలని కోరారు.

TGCET  పరీక్షలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. పరీక్షా వ్రాయనటువంటి విద్యార్థులను డ్రా పద్దతిలో ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు 16 నాడు సాయంత్రం 5గంటలలోపు చేర్యాల గురుకుల పాఠశాలలో లేదా తమకు దగ్గరలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నెల 18 నాడు ఉదయం10 గంటలకు చేర్యాల గురుకుల పాఠశాలలో  కౌన్సిలింగ్/డ్రా పద్ధతిల ద్వారా ఎంపిక చేయబడతారని వెల్లడించారు. విద్యార్థుల యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లు(Caste, Income, Date of Birth, Aadhaar Card, TGCET Hall Ticket) మూడు జిరాక్స్ సెట్లతో ఉదయం 10 గంటలలోపు హాజరవ్వాలని తెలిపారు.