15-10-2025 12:00:00 AM
-గిరిజన మహిళపై హత్యాచారం
-ఇంతకు ముందే మరో మహిళను చంపిన నిందితుడు
-ఆ కేసులో జీవిత ఖైదు విధించిన కోర్టు
-శిక్ష పడుతుందనే గిరిజన మహిళపై ఘాతుకం
-ఏడుపాయల కమాన్ వద్ద హత్య కేసును ఛేదించిన పోలీసులు
మెదక్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మెద క్ జిల్లా కొల్చారం మండలం ఏడుపాయల కమాన్ వద్ద కొన్ని రోజుల క్రితం జరిగిన గిరిజన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదిం చారు. గత సోమవారం జీవిత ఖైదు పడిన నేరస్థుడే హత్యాచారం చేసినట్లు తేల్చారు. మంగళవారం ఎస్పీ డివి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీర్ నాయక్ సం గారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం అంబోజిగూడలో నివాసం ఉంటున్నాడు. గతంలోనే ఫకీర్ నాయక్‌పై ఏడు కేసులు ఉన్నాయి. మెదక్ పట్టణంలో ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేశాడు. మరో మహిళను కల్లు దుకాణంలో అత్యాచారం చేసేందు కు యత్నించాడు. మెదక్‌లో మహిళ హత్య కేసులో కోర్టు సోమవారం జీవిత ఖైదు శిక్షను విధించింది.
ఆ కేసులో ఎలాగూ శిక్ష పడుతుందని భావించిన ఫకీర్ నాయక్ మెదక్ పట్టణంలోని అడ్డా కూలీ వద్ద మహిళను పనికోసమని చెప్పి బస్సులో కొల్చారం మండలం ఏడుపాయల కమాన్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన కోరిక తీర్చాలని కోరడంతో అం దుకు ఆమె ఒప్పుకున్నది. దీంతో నిందితుడు పైశాచికంగా వ్యవహరించాడు. ఆమె ఒంటిపై బట్టలు తొలగించి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేశాడు. రోజంతా ఆమెపై అత్యాచారం చేసి చివరకు రాయితో బాది అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
నేరుగా మెదక్ చర్చి వద్దకు వెళ్లి, బట్టలు మార్చుకొని వెళ్లాడు. బట్టలు లేకుండా చెట్టుకు కొన ఊపిరితో ఉన్న మహిళను గుర్తించిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెం దింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. ఎస్పీ శ్రీనివాసరావు ఇద్దరు డీఎస్పీలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపారు. సీసీ కెమెరాలను పరిశీలించగా మహిళపై హత్యాచారం చేసింది ఫకీర్ నాయక్‌గా గుర్తించి, అరెస్టు చేశారు. హత్య కేసును త్వరగా ఛేదించిన డీఎస్పీలు, సిఐ, ఎస్‌ఐ, సిబ్బందికి ఎస్పీ శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలు, నగదుతో సత్కరించారు.