calender_icon.png 21 November, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సై హరీష్ వర్ధంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

21-11-2025 10:55:34 PM

రేగొండ,(విజయక్రాంతి): దివంగత ఎస్సై హరీష్ రుద్రారపు మొదటి వర్ధంతి కార్యక్రమం వారి స్వగృహం కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది.ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, హరీష్ చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎస్సై హరీష్ తన విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ,బాధ్యతాయుతమైన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి అని అన్నారు. ఎస్సై హరీష్ లాంటి నిజాయితీ కలిగిన పోలీస్ అధికారిని కోల్పోవడం వారి కుటుంబానికి, బంధుమిత్రులకు, ఈ గ్రామానికి, మండలానికి, జిల్లాకి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు ఉన్నారు.