calender_icon.png 21 November, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చండూరులో ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు

21-11-2025 11:01:56 PM

చండూరు,(విజయక్రాంతి): చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జన విజ్ఞాన వేదిక మండల స్థాయి సైన్స్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంఈఓ వూటుకూరు సుధాకర్ రెడ్డి, చండూరు మున్సిపల్ కమిషనర్ మల్లేశం, టిఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల టామ్ రెడ్డి (వెంకట్ రామ్ రెడ్డి) జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, నమ్మకానికి మూఢనమ్మకానికి, విశ్వాసానికి అంధ విశ్వాసానికి  గల తేడాలను విద్యార్థులకు వివరించారు.

సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, జరిగే ప్రతి సంఘటన వెనుక సైన్సు దాగి ఉంటుందని వివరించారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మండల స్థాయికి ఎంపికైన ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలతో పాటు  టిఆర్ ఫౌండేషన్ చైర్మన్ టామ్ రెడ్డి (వెంకట్ రామ్ రెడ్డి) బహుకరించిన జ్ఞాపికలను అతిథులు, అధికారులు కలిసి అందజేశారు. అలాగే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అతిథులకు కూడా జ్ఞాపికలను అందజేశారు. మండల స్థాయి సైన్స్ సంబరాల్లో భాగంగా నిర్వహించిన చెకుముకి జిల్లా స్థాయి టెస్టులో ఎంపికైన  చండూరుకు చెందిన సన్ షైన్ పాఠశాల, చండూరు హైస్కూల్, బోడంగిపర్తి గురుకుల పాఠశాల విద్యార్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు.