calender_icon.png 21 November, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాస్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్‌కు విద్యార్థుల ఎంపిక

21-11-2025 11:19:13 PM

చిగురుమామిడి,(విజయక్రాంతి): చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జన జ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు. ఈ మేరకు మండలంలోని సుందరగిరిలో మండల స్థాయిలో నిర్వహించిన జన విజ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ఇందుర్తి ఉన్నత పాఠశాలకు చెందిన సాయి వర్షిత, సుస్మిత, అక్షిత్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.

ఈ పోటీలో మండలంలోని 12 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఎంఈఓ పావని, ఇన్చార్జిలు భాషబత్తిని ఓదెల కుమార్, వనిత, ఉపాధ్యాయ బృందం, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సుమంత్ అభినందించారు.