21-11-2025 11:11:47 PM
ఐసీడీఎస్ సూపర్వైజర్ రేవతి, ధరణి
గరిడేపల్లి,(విజయ క్రాంతి): బాల్య వివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్ రేవతి, ధరణి అన్నారు. మండల పరిధిలోని సర్వారం, కల్మలచెరువు, మర్రికుంట, గడ్డిపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించి మన సూర్యాపేట జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని బాల్య వివాహ రహిత జిల్లాగా, రాష్ట్రంగా మార్చడం మనందరి బాధ్యత అన్నారు.
బాల్యవివాహాలు ఒక సామాజిక రుగ్మత చిన్న వయసులోని పెళ్లి చేయడం వల్ల బాలికలు వారి చిన్నతనాన్ని చదువును కోల్పోతున్నారన్నారు.ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ఎదుగుదల సరిగ్గా లేకపోవడంతో తల్లులుగా మారినప్పుడు వారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది వారి భవిష్యత్తును మాత్రమే కాదు మొత్తం సమాజ పురోగతిని కూడా అడ్డుకుంటుందని అన్నారు. బాల్యవివాహాలు నిషేధించే చట్టాలు ఉన్నాయని అదేవిధంగా మీ చుట్టుపక్కల ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కానీ 100 నెంబర్ కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు.