calender_icon.png 2 August, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరజ్ ఆటవిడుపు

05-10-2024 12:00:00 AM

ముంబై: పారిస్ ఒలింపిక్స్ నుంచి క్షణం తీరిక లేకుండా గడిపిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు స్పాన్సర్‌గా వ్యవహరించిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తోన్న మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్ (ఎంయూఎస్‌వో)ను నీరజ్ సందర్శించాడు.

ఈ నేపథ్యంలో మ్యూజియంకు వచ్చిన  పిల్లలతో సరదాగా ముచ్చటించాడు. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించి వరుసగా రెండో ఒలింపిక్ పతకం అందుకున్నాడు. అనంతరం జర్మనీలో జరిగిన బ్రస్సెల్ డైమండ్ లీగ్‌లో పాల్గొన్న నీరజ్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.