calender_icon.png 2 August, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనంద్ ఓటమి

05-10-2024 12:00:00 AM

గ్లోబల్ చెస్ లీగ్

bగ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్)లో భాగంగా ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఓటమి చవిచూశాడు. శుక్రవారం గాంగ్స్ గ్రాండ్‌మాస్టర్స్,  ముంబా మాస్టర్స్ తలపడ్డాయి. ముంబా మాస్టర్స్ తరఫున బరిలోకి దిగిన ఆనంద్ ముంబా మాస్టర్స్‌కు చెందిన మ్యాక్సిమే లాగ్రేవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

మిగిలిన మ్యాచ్‌ల్లో విదిత్‌తో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ డ్రా చేసుకోగా.. హంపి వైశాలీపై విజయం నమోదు చేసుకోగా.. హారిక డ్రా చేసుకుంది. ఓవరాల్ గా ముంబా మాస్టర్స్ 14-5 తేడాతో గాంగ్స్ గ్రాండ్‌మాస్టర్స్‌పై విజయం సాధించింది.