08-11-2025 07:35:43 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్‌వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ ఒడి ఫౌండేషన్, డిలైట్ ఫౌండేషన్, మా ఫౌండేషన్ కార్యాలయాలలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి రవి, కర్రె రాజేష్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు, ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో పలు పథకాలను అమలు చేస్తున్నారు. విద్యార్థులు చదువులో ముందుకు సాగి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలని ఆశయంతో ఆర్‌వి ఫౌండేషన్ విద్యార్థుల ప్రోత్సాహక కార్యక్రమాలను కొనసాగిస్తుందని” తెలిపారు.