ఏజెన్సీల నిర్లక్ష్యం.. సిబ్బందికి శాపం!
- ఈపీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించని వైనం
- 2020 నుంచి తొలగని సమస్య
- పట్టించుకోని జిల్లా అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, మే 15, (విజయ క్రాంతి) రెక్కల మొక్కలు చేసుకుని కష్టించి పనిచేసిన, ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌ కర్యాలు అందడం లేదు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మా రిందని మిషన్ భగీరథ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ భగీరథ లో పనిచేస్తున్న కార్మికులకు ఏజెన్సీలు తీవ్ర అన్యాయం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరో పిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీస్ కార్మికులకు చెల్లించాల్సిన ఏపీఎఫ్, ఈఎస్‌ఐ సక్ర మంగా చెల్లించడం లేదని, నెల నెల వేతనాలను కూడా సక్రమంగా ఇవ్వటం లేదని కా ర్మికుల ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా అదనప కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
జిల్లాలో 810 కార్మికులు
జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఎన్ సీ సీ కంపెనీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో మిషన్ భగీరథ పథకంలో ఎలక్ట్రిషన్లు, పంప్ ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, వాటర్ ట్యాంకు లైన్ ఆపరేటర్లు గా విధులు నిర్వర్తిస్తూ నిరంతరాయంగా గోదావరి వాటర్ ని శుద్ధికరమైన నీటిని ట్యాంకులు ద్వారా అందిస్తూన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు లెక్క చేయకుండా కరోనా టైంలో కూడా నిరంతరాయంగా వాటర్ సప్లై అందించారు.
ఎల క్ట్రిషన్లు 11 కె.వి /0.430 వోల్టేజ్ తో ఎల్లవేళలా ప్రాణాలు పణంగా పెట్టి మోటార్లు రన్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకులకు నేటిని ఎ క్కించే ఇందులో రాత్రిపూట వాటర్ ట్యాంకు ఎక్కి విధులునిర్వహించాల్సి ఉంది. కుటుంబ పోషణ నిమిత్తం జీతం కూడా నెల నెల ఇవ్వకున్నా ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తు న్నారు.
ఏజెన్సీలు ఏమి చెప్పాయంటే..
ఔట్సోర్సింగ్ ఏజెన్సీ లో వీధుల్లో చేరే సమయంలో ఏజెన్సీ అధికారుల మీకు పి ఎఫ్, ఈఎస్‌ఐ చెల్లిస్తామని, దీంతో మీకు,మీ కుటుంబానికి ఆరోగ్య భద్రత ఉంటుందన్నారు. కొన్ని రోజుల క్రితం ఎన్‌సీసీ కంపెనీ లో ఎలక్ట్రిషన్‌గా నిధులు నిర్వహిస్తున్న కా ర్మికుడు టేకులపల్లి మండలంలోని 9వ మై ల్ తండా పంప్ హౌస్ లో మెయింటెనెన్స్ చేసుకొని ఇంటికి వెళుతుండగా వెళ్లే మధ్య లో రోడ్ ప్రమాదానికి గురయ్యాడు.
ఈఎస్‌ఐ చూపిద్దాం అనుకుంటే ఈఎస్‌ఐ పనిచే యటం లేదు అని చెప్పారు . రూ1.50 లక్ష లు సొంత ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం బాగుచేయించుకున్నాడు.ఇన్సూరెన్స్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ పనిచేయటం లేదన్నారు.ఈఎస్‌ఐ అందుబాటులో లేకపోవడంతో ఆర్థిక భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇంత వరకు అమలు కాలేదన్నారు.
ఆన్లైన్లో ఒక కంపెనీ చూపిస్తుంది ఆఫ్లైన్లో మరో కంపెనీ చూపిస్తోంది. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఈఎస్‌ఐ లో చూ పించుకుందాం అనుకుంటే. మీకు ఏడాది కూడా ఎక్స్పీరియన్స్ లేదని ఈ ఎస్ ఐ హా స్పిటల్ యాజమాన్యం చెప్తున్నారు . ఈ సంఘటనలతో ఎన్ సీ సీ కంపెనీ ఈ ఎస్ ఐ బాగోతం బయటపడింది.
కంపెనీ వారి నిర్లక్షం వల్ల కార్మికులు నష్టపోతున్నారు.జిల్లాలో పనిచేస్తున్న 810 మం దిలో ఇప్పటికీ 6గురు మరణించారు. వారి కుటుంబాలకు ఇంత వరకు డెత్ క్లైమ్ రాలే దు. ఇది ముమ్మాటికి ఏజెన్సీ లోపం, అధికారుల నిర్లక్ష్యం. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిబం ధనల ప్రకారం వ్యవహరించకపోవడంతో కార్మికుల జీవితాలు రోడ్డు పాలవుతున్నా యి.
ఇదేమిటని అడిగితే ఇష్టం ఉంటే చే యండి, లేకపోతే మానేయండి అని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని కార్మికుల ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లో తమ సమ స్యలు పరిష్కరించకుంటే జెఎసి ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ ను కలిసిన వారిలోతెలంగాణ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇం డిపెండెంట్ రిజిస్ట్రేషన్ జాయింట్ సెక్రెటరీ మేడి సుందర్ రావు (పర్ణశాల సెగ్మెంట్) సాయి పవన్ శ్రీను కాము శ్రీనివాస్ నాగరాజు (ఐ ఎన్ టి యు సి) యం.చంద్ర శేఖర్,మ హేందర్ రెడ్డి, (తోగూడెం పంప్ హౌస్) సా యి ప్రసాద్,,శివరెడ్డి ప్రభాకర్ పూర్ణ ,పాషా,
శ్రీనివాస్,అనిల్,పాండు,అజారుద్దీన్, నరేష్, మంగీలాల్, (బీఆర్‌ఎస్ ట్రేడ్ యూనియన్) రథం గుట్ట కుమ్మరిగూడెం పంప్ హౌస్ మా మిళ్ళ రాంబాబు,యం.కర్ణకుమార్ ,చందు ,ప్రసాద్ భుక్యా , గంగరాజు నాగరాజు వరప్రసాద్ పూర్ణచంద్రరావు, షఫీ, శ్రవణ్, పా షా,బండి వెంకటేశ్వర్లు, గంగరాజు, ప్రశాంత్, రాజు, ముజాహిద్,లాల్, 9 మైల్తాండ కోరాగట్టు పంప్ హౌస్‌సోడి పృద్వి కిషోర్ విద్య సాగర్ (సిఐటియు) నరసింహారెడ్డి వినయ్ రాజేష్ (ఐఎఫ్టియు) ఉన్నారు.






