calender_icon.png 16 May, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్వాక్రా గ్రూప్ మహిళల సొమ్ము స్వాహా..

15-05-2025 11:22:26 PM

వివోఏ చేతివాటం?

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామంలో ఓ మహిళా సంఘం సభ్యులు బ్యాంకులో జమ చేయాల్సిన డబ్బులు వివోఏ స్వాహా చేసినట్లు మహిళా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం బ్యాంకు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు అప్పు తీసుకుని ప్రతి నెల క్రమం తప్పకుండా 35000 చొప్పున చెల్లిస్తుండగా ఆ డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా వివోఏ సొంతానికి వాడుకున్నట్లు మహిళా సంఘం సభ్యులు గురువారం మండల మహిళా సమాఖ్య కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు.

తాము చెల్లించిన వాయిదాల ప్రకారం అప్పు చెల్లిపోయిందని ఇటీవల బ్యాంకుకు వెళ్లి కొత్తగా రుణం కావాలని బ్యాంకు అధికారులను అడగగా మీరు ఇప్పటికే తీసుకున్న అవును బాపతు ఎనిమిది లక్షలు అసలు వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉందని చెప్పడంతో హతాసులైన వారు గ్రామంలో వివోఏను ఈ విషయంపై నిలదీయగా మీరు నాకు డబ్బులు చెల్లించలేదు ఎక్కడ చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి అని తమని దబయిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనే ఇంతకుముందు ఒకటి కూడా తమ గ్రామంలో జరిగిందని అందులో కూడా వివోఏ చేతివాటం చూపిందని మహిళలు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని మండల మహిళా సమాఖ్య ప్రతినిధులకు అధికారులకు ఫిర్యాదు చేశారు.