18 April, 2026 | 7:13 PM

’పీవీఎన్‌ఆర్’పై రెండు కార్లు బోల్తా

16-05-2025 12:00 AM

రాజేంద్రనగర్, మే 15: పీవీఎన్‌ఆర్ ఎక్స్ ప్రెస్ వే ఫ్లైఓవర్ పై రెండు కార్లు ఢీకొని బోల్తాపడ్డాయి. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. వివరాలు.. రెండు ఫార్చునర్ కార్లు మెహిదిపట్నం వైపు నుం చి శంషాబాద్ వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో 294 పిల్లర్ నెంబర్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. అనంతరం వాహనాలు బోల్తా పడ్డాయి.

ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. వి షయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని స్థంభించిన వాహనాలను క్లియర్ చేశారు. అనంతరం రెండు వాహనాలను అక్కడి నుంచి తొలగించారు.