02-01-2026 12:00:00 AM
ఆ ఫారెస్ట్ భూములు పేదలకు పంచాలి
అడ్డగోలుగా చెట్లు నరికిన నాడు అధికారులకు నిబంధనలు కనిపించలేదా..
పేదలకో న్యాయం, పెద్దలకు మరో న్యాయమా..?
రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు సరోజ
మణుగూరు, జనవరి1 (విజయక్రాంతి): మండలంలోని అడవులులను సంరక్షించడంలో ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని, పేదల పట్ల ఓ మా దిరిగా, పెద్దలపట్ల మరో మాదిరిగా వ్యవహరించడం సరికాదని, రేణుక అక్షర మహిళా మం డలి అధ్యక్షురాలు పూనెం సరోజ అన్నారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయం లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనుమతుల పేరిట ఇసుక క్వారీల ని ర్వాహకులు గుట్టమల్లారం రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోని వేలాది వృక్షాలను నరికి ఫోర్ లైన్ రోడ్లు వేసినపుడు అటవీ అధికారులకు నిబంధనలు కనిపించలేదాని ప్రశ్నించారు. కలెక్టర్ అనుమతులు ఇచ్చారనీ ఇసుక ర్యాం ప్ కోసం మామూళ్ల మత్తులో వేల సంఖ్య లో దశాబ్దాల నాటి వృక్షాలు నరికి రోడ్లు వే సి అడవినీ రక్షించాల్సిన వారే భక్షించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వృథాగా ఉన్న ఫారె స్ట్ భూములను వెంటనే ఇల్లు లేని నిరుపేదలకు పంచాలని సరోజ డిమాండ్ చేశారు. క మలాపురం, రాయిగూడెం గ్రామాలలో ని రుపేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటేనే తమ భూమి అంటూ ప్రతాపం చూపినఅధికారులు ఆరు కిలోమీటర్ల మేర అడవిని ధ్వంసం చేసి వేల చెట్లు తొలిగించి వన్య ప్రాణులకు ఆవాసం లేకుండా చేశారన్నారు. ఏ నిబంధన మేరకు ఇలా చేశారు ఫారెస్ట్ అధికారులు సమాధానం చెప్పాలని నిల దీశారు. ఇసుక లారీల వద్ద ప్రతి రోజు ఒక్కో లారీ నుండి 100 నుండి 200 వంద లు వసూలు చేశారని, ఏ అధికారి అనుమతితో వసూలు చేశారో ఫారెస్ట్ అధికారులు ప్రజలకు బహిరంగంగా వివరించాలని డిమాండ్ చేశారు.
అధికారులు తీరుఫై రాష్ట్ర అటవీ అధి కారులను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుఫిర్యాదు చేస్తామని, అడ్డగోలుగా అడవి నరికిన అటవీ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు విశ్రమిం చేది లేదని తెలిపారు. అవసరమైతే దశల వారీగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో సీనియర్ నాయకురాలు ఎండి షబానా కోరి శ్యామల, బొడ్డు సౌజ న్య, రెడ్డిబోయిన రేణుక, దేరంగుల సుజాత, కన్నాపురం వసంత,డాకూరి సౌజన్య పాల్గొన్నారు.