03-01-2026 07:21:05 PM
మోతే,(విజయక్రాంతి): మండల పరిధిలోని నేరడవాయి గ్రామంలో మాజీ యం పిపి ముప్పాని ఆశ భర్త శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం రాత్రి తన నివాసంలో గోపతండ సర్పంచ్ భూక్య బిక్కు, నేరడవాయి సర్పంచ్ దారమళ్ళ గోవర్ధన్ కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేపించి బాణా సంచా కాల్చి శ్రీకాంత్ రెడ్డికి ఇద్దరు సర్పంచులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామస్తులకు స్వీట్స్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రెండు గ్రామాలకు శక్తి మేరకు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు భూక్య నరేష్ నాయక్, కావిటి రవి, కొచ్చర్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.