calender_icon.png 5 January, 2026 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ఎంపిక

03-01-2026 07:06:49 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ వాసవి క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ఎంపికను ఆ క్లబ్ అంతర్జాతీయ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని స్థానిక వాసవి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ బహుళ ఉపాధ్యక్షుడు ఏకిరాల శ్రీనివాస్, చార్టర్ ప్రెసిడెంట్ గంధం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. 2026 సంవత్సరానికి గాను ఆసిఫాబాద్ వాసవి క్లబ్ ఆధ్యక్షుడిగా మర్యాల ఉదయబాబు, ప్రధాన కార్యదర్శిగా బాల శ్రీనివాస్, కోశాధికారిగా కలకుంట్ల శ్రీధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. అనంతరం వారిని శాలువా కప్పి సన్మానించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... క్లబ్ సభ్యులను సమన్వయం చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో నిరుపేదలకు అందించే సేవలను విస్తృతం చేసి ఆసిఫాబాద్ వాసవి క్లబ్ ను అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు చిలివేరి వెంకటేశ్వర్, జిల్లా ఉపాధ్యకుడు గుండా బాలేష్, వాసవి ఆలయం కమిటి అధ్యక్షుడు రావుల శంకర్, మాజీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పాత శ్రీనివాస్, ముక్క కృష్ణమూర్తి, సభ్యులు గుండా ప్రమోద్, దిలీప్, వేణుగోపాల్, మురళి, రవీందర్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.